![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -347 లో.... దీప ఇంటికి వచ్చిందని తెలిసి శ్రీధర్ ని గది లోపల ఉంచి బయట డోర్ వేసి దీప దగ్గరికి వస్తుంది. దీపతో కావేరి మాట్లాడుతుంటే శ్రీధర్ ఎంట్రీ ఇస్తాడు. ఎప్పటిలాగే దీప ని నిందిస్తుంటాడు. ఎందుకు వచ్చారు దీప దగ్గరికి వెళ్లి కార్తీక్ కి విడాకులు ఇవ్వమని చెప్పి బాధపెట్టారు.. మళ్ళీ ఎందుకు వచ్చారని అనసూయ అంటుంది. అంటే దీప నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమనడానికి కారణం నువ్వా అని శ్రీధర్ తో కార్తీక్ అంటాడు.
మీకు కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా అని కార్తీక్ తిడతాడు. ఇప్పుడు నా కోడలికి సారీ చెప్పాలని కాంచన అనగానే నేను చెప్పనని శ్రీధర్ అంటాడు.. అనసూయ గారు మీరు వెళ్లి చీపురుకట్ట తీసుకొని రండీ అని కార్తీక్ అనగానే అనసూయ తీసుకొని వస్తుంది. ఇప్పుడు మీరు సారీ చెప్పకపోతే దానికి పని చెప్పాల్సి ఉంటుందని కార్తీక్ అనగానే శ్రీధర్ బయపడి సారీ చెప్తాడు. మరొకవైపు దీప ఏ తప్పు చెయ్యలేదని కార్తీక్ తన భార్యకి సపోర్ట్ చేసి బెయిల్ పై బయటకు తీసుకొని వచ్చాడని జ్యోత్స్న పారిజాతం ఇద్దరు దశరథ్ తో చెప్తారు.
దీప చెయ్యలేదేమో బుల్లెట్ తన గన్ లోనిది కాదని తేలింది కదా అని దశరథ్ అంటాడు. మరి ఆ అవసరం ఎవరికీ ఉంటుందని శివన్నారాయణ అంటాడు. ఏమో చెప్పలేం మొదట సుమిత్రపై ఎటాక్.. ఆ తర్వాత దాస్, దీప శౌర్యలపై ఎటాక్ జరిగింది కదా నాపై ఎటాక్ , సుమిత్ర పై ఎటాక్ చేసింది ఒక్కరేమోనని దశరథ్ అంటాడు. సుమిత్రపై ఎటాక్ చేసింది నేనే కానీ దశరత్ పై ఎటాక్ చేసింది మాత్రం నాకు తెలియదని పారిజాతం అనుకుంటుంది. ఏదైనా సరే ఎవరు షూట్ చేసారో తెలుస్తుందని దశరథ్ అంటుంటే జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. మరొకవైపు దీప, కార్తీక్, శౌర్య, అనసూయ, కాంచన అందరు భోజనం చేస్తుంటారు. కార్తీక్, దీపలకి శౌర్య తినిపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |